జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

జోగులాంబ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. హోలీ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వేకువజాము నుంచే భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయంలో పౌర్ణమి, శుక్రవారం సందర్భంగా చండీ హోమం నిర్వహించగా117 జంటలు పాల్గొన్నాయి.